Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నేనో వలసజీవిని......

*ఒక బిడ్డని* 
నెత్తినెట్టుకొని...
ఇంకో బిడ్డని....
చంకనెత్తుకొని....
కాలికి చెప్పులు ...
లేకుండా.......
సొంత ఊరికి...
బయలుదేరిన ...
బాటసారిని..
నేనో వలస జీవిని....

*ఈ మందుటెండలో...*
నా కాలు కాలిన పర్లేదు...
నా బిడ్డ ...
చల్లగుండాల...
అని...
ఆ నిప్పుల కొలిమిని...
పంటి బిగువున దాచిపెట్టి..
పైకి.. నువ్వుతున్న...
ఒక సగటు తల్లిని...
నేనో వలస జీవిని....

*నా కడుపు* 
ఎండిన పర్లేదు...
నా చంటి దాని....
కడుపు నిండాల....అని...
దారిలో ఎవరో...ఒకరు...
ఏదో ఒకటి..ఇవ్వకపోతారా
అని ఎదురుచూసే...
అభాగ్యురాలిని...
నేనో వలసజీవిని.....

*ఏ బస్సు లేకున్నా....*
ఏ రైలు రాకున్నా...
నా పయనం ఆగదు....
నా కాల్లల్లో
శక్తి ఉన్నంత వరకు......
ఎన్ని వేల కిలోమీటర్లయిన...
నడుస్తా....
ఎందుకంటే
నేనో వలసజీవిని...

*నన్ను అనాథను...*
చేసింది నా తల్లి...
భారతావని...

Post a Comment

0 Comments