Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

చిన్నప్పటి నుంచి ఒకే కోరిక

 


చిన్నప్పటి నుంచి ఒకే కోరిక 


మా అమ్మని కారులో తిప్పాలని 


కానీ మనకా అంత డబ్బు ఉండేది కాదు . . .


ఆఖరికి ఆఫీస్ కార్ నే  . . 


నా కారు అనుకొని తిప్పేవాణ్ణి . .. 


ఏదో ఆ కోరిక ఆలా తీరిపోయింది 


తను ఇంగ్లీష్ లో 


మాట్లాడుతుంటే 


దొరసానిలా అనిపించేది . . .


తను పాట పాడుతుంటే .  . 


లతా మంగేష్కర్ తరువాత . . 


మా అమ్మే అనిపించేది . .. 


ఏమని పాడెదనో ఈ వేళా  . . .


తనకి బాగా ఇష్టమైన పాట  . . .


తను ఆలా పాడుతుంటే . . 


తన ఒళ్ళో తల పెట్టుకొని . . 


అలానే పడుకోవాలి . . 


కాలం ఇలాగే ఆగిపోతే . .


ఎంత బాగుంటుందో అనిపించేది . . . 


పైన తథాస్తు దేవతలు లేరేమో 


ఎవ్వరూ నా ప్రార్థన విన్నట్లు లేరు . . .


కాలం కదిలిపోయింది . . .


తను వెళ్లిపోయింది  .. 


నేనిలా . . మిగిలిపోయాను ..  .


అమ్మ  . . నువ్వంటే నాకిష్టం . .


ఎంత అంటే . . 


మాటల్లో చెప్పడం కష్టం . .. 


@ఎప్పటికీ . . నీ రాము

Post a Comment

0 Comments