Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఒక చిన్న ఆసరా దొరికేది ఎప్పుడో... @ KSR CREATIVES



*కోపం వస్తే...*
గట్టిగా అరవాలి....
బాధగా ఉంటే...
బోరుమని ఏడవాలి.....
సంతోషం కలిగితే...
హాయిగా నవ్వాలి....
కడుపునిండా... తినాలి...
సుఖంగా పడుకోవాలి....
🤨😰🤪🥱😴
*ఇవన్నీ చాలా ...*
చిన్న చిన్న కోరికలే...
పైగా... పైసా ఖర్చు లేని ...
కోరికలు....
ఈ మధ్య.... ఇవి కూడా....
గొంతెమ్మ కోరికల్లాగా....
మిగిలిపోతున్నాయి...
👎👎👎👎
*కోపాన్ని...* దిగమింగుకొని...
బాధని అణచుకొని....
రాని నవ్వును.. 
ముఖాన పులుముకొని....
కడుపు మాడ్చుకొని...
నిద్రలేని రాత్రులు....
గడపాల్సి వస్తుంది....
🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️
*కరెన్సీ కట్టల....*
సంద్రంలో.......
చిక్కుకొని......
అన్ని కోరికలకు.... దూరమై....
అటు ఆ ఒడ్డుకి...
చేరలేక....
ఇటు.. బయటకు రాలేక...
రెంటికి చెడ్డ రేవడిలా...
ఊపిరి ఆడక...
గిల గిలా కొట్టుకొంటున్న...
ఓ సగటు జీవికి... 
ఒక చిన్న ఆసరా.....
దొరికేది..... ఎప్పుడో....
🤔🤔🤔🤔
*@ KSR CREATIVES*

Post a Comment

0 Comments