Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

EM SANDEHAM LEDU SONG | UHALU GUSA GUSA LADE MOVIE | KSR CREATIVES

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు యిచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందే చిలకా!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు యిచ్చింది

... వెన్నెల్లో వున్నా ... వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే
... ఎందర్లో వున్నా ... ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాబి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలకా!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ

... వెన్నెల్లో వున్నా ... వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే
... ఎందర్లో వున్నా ... ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే

ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటోంది విన్నావా
ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోనీ ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖ

Post a Comment

2 Comments