జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా..
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా..మైనా..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ మైనా..
కలలను పెంచకు కలతలు దాచకు ఏ మైనా..ఓ మైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా..
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా..మైనా..
అడగనులే చిరునామా ఓ మైనా..ఓ మైనా..
చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా.. నాకైనా..
తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ..
తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ..
హరివిల్లు రంగుల్లో అందాలే..
చిలికిన చిలకవు,ఉలకవు పలకవు.ఓ మైనా..ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా..
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా..
మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా..
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ..
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ..
వినువీధి వీణంలో రాగంలా..
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఈమైనా..
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా..
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
గుడికే చేరని దీపం..పడమటి సంధ్యా రాగం..
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ మైనా..
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా..మైనా..
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా!!
0 Comments