బయట హోరుగా వర్షం పడుతోంది......
అన్నీ నాకు ఇష్టమైన డ్రెస్సులే
ఏ డ్రెస్ బ్యాగ్లో పెట్టుకోవాలో అర్థం కావడం లేదు . .
అయినా ఇలాంటి టైం లో కూడా . .
డ్రెస్ గురించి ఆలోచించాలా .. .
నా ఖర్మ కాకపోతేనూ, ,
అనుకుంటూ చేతికి దొరికిన., . .
నాలుగైదు డ్రెస్సుల్ని బ్యాగ్లో .. . కుక్కేసా. . .
వాడితో . . .నాకు . .
10TH క్లాస్ నుంచి పరిచయం. . . .
మా ఇంటి పక్క గల్లీ లోనే ఉండేవాడు
చాలా సైలెంట్ గా ఉండేవాడు ..
మంచి CLEVER స్టూడెంట్ . .
క్లాసులో ఎప్పుడు ఫస్ట్ వాడే
ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు
వాడి ప్రవర్తన చూసి. . .
వాడికి బాగా పొగరు అని అనుకొనే వాళ్ళం, ,.
ఆలా చూస్తూ ఉండగానే
పరీక్షలు మొదలయ్యాయి
రాత్రి పగలు . . .కష్టపడి చదివా . ..
బహుశా ఇష్టపడి చదివితే పాస్ అయ్యేదాన్ని ఏమో ...
EXAM రోజు గుడికి పోయినా బాగుండేదేమో . .
ఆ దేవుడికి కూడా కోపం వచ్చి. . .
నేనంటే లెక్క లేదా అని .. .
లెక్కల్లో ఫెయిల్ చేసాడు . . .
ఇంట్లో, స్కూల్లో, బంధువుల ముందు .. .
తలెత్తు కోకుండా చేసాడు. .. .
అందరు తిట్టే వాళ్లే. ...
ఒక్క మా నాన్న తప్ప .. .
నా బంగారు తల్లి. . .
పరీక్షా బాగానే రాసి ఉంటుంది.,
ఆ పేపర్ కరెక్షన్ చేసిన వెధవదే తప్పంటాడు. .
వాడికే లెక్కలు వచ్చిండవు అంటాడు . . .
కోపంతో వారం రోజులు
మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. ..
ఇంతకీ అసలు విషయం
చెప్పలేదు కాదు. .
అదే మా పక్క గల్లీ కుర్రాడు .. .
ఎంచక్కా డిస్టింక్షను లో పాస్ అయిపోయాడు
ఇంకా సప్లిమెంటరీ . .
పరీక్షలకి. . . రెండు నెలలు .. .టైం వుంది., . .
ఎలాగైనా కష్టపడి. . .సారీ ఇష్టపడి చదివి పాస్ అయిపోవాలి. .
లేకుంటే మా అమ్మ
నన్ను ఇంట్లో . .వున్న పని మనిషిని మనిపించి
నన్ను పెర్మనెంట్ పని మనిషిగా మార్చేస్తుంది
సమయానికి . . .
మా ఊర్లో వున్నా ఒక్క మాస్టారు కూడా . ..
ట్రాన్స్ఫర్ అయ్యి పక్క ఊరికి వెళ్లిపోయారు . .
ఇంక నా ఫ్రెండ్స్ కి . .
వచ్చే లెక్కలు కూడా అంతంత మటుకే
ఏదో వాళ్ళ అదృష్టం బాగుండబట్టి పాస్ అయిపోయారు . .
నాలాంటి . . ఇంటెలిజెంట్ కి
ట్యూషన్ చెప్పేటంత
ధైర్యం ఎవరికీ ఉందబ్బా అని .
.ఇలా ఆలోచిస్తూ,. . . వారం రోజులు గడిచి పోయాయి.. . .
నా బాధ చూడలేక
మా నాన్న . .
ఏంటమ్మా .. . .
ఆ పక్క గల్లీ కుర్రాడు డిస్టింక్షను లో
పాస్ అయ్యాడట కదా . ..
ఒక్క సారి పిలిపించి . .
మాట్లాడమంటావా
"నీకు ఏమైనా. .. .హెల్ప్ చేస్తాడేమో . . అని . ."
అన్నాడు. . . .
మా నాన్న ఊర్లో. . సర్పంచ్ . . .
ఆ అబ్బాయి వాళ్ళ నాన్న
అప్పుడప్పుడు మా నాన్న
దగ్గరికి. . సమస్య ఉంటే వచ్చేవాడు. . .
అందుకని మా నాన్న ఆలా అన్నాడు .. .
ఇంక వేరే దారి లేక .,
ఎక్సమ్ దగ్గర పడుతున్నాయని ....
సరే నాన్న నీ ఇష్టం అన్నాను. .
అప్పుడే ఐపోలేదు
కథ ఇప్పుడే మొదలయ్యింది. . .
రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం
0 Comments