Chilaka Music Video Lyrics - vijai bulganin & lakshmi meghana
Singer | vijai bulganin & lakshmi meghana |
Composer | Vijai bulganin |
Music | Vijai bulganin |
Song Writer | suresh banisetti |
Lyrics
కన్నీటి సంద్రంలోన
కంటి పాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే
ఏవి ఏవి మరి నిన్నటి కలలు లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండ వాలి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేనులే
వస్తున్నా వస్తున్నా నీ కోసం వస్తున్నా
సుడిగాలి వేగంతో .. నీ వైపే వస్తున్నా
ఏ దారి మూస్తున్నా ఏ దాడి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా
చిలక ఓ రామ చిలకా చెరిగేది కాదే
ఎదపై నీ ముద్దు మరక
చిలక ఓ రామ చిలకా
ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునక
నా ఆశలకి ఆయువిమ్మని
నా ఊహలకి ఊపిరిమ్మని
నా చీకటికి వెలుగులిమ్మని ఎవరినడగడం
నీ కంటపడే వీలు లేదని
నీ వెంట వచ్చే దారి లేదని
నా జీవితమే జారుతోందని ఎలా తెలపడం
ఒక్క పూట ఉండ లేక పోయాను ..
నువ్వు లేక వందేళ్ళేట్టా గడపాలిక
కన్న కలలే కట్టు కథలాగా మార్చినది
కాలానికే దయ లేదుగా
చిలక ఓ రామ చిలకా
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరక
చిలక ఓ రామ చిలకా
ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునక
ఆ వెన్నలని అడిగి చూసా
ఈ వేకువనే అడిగి చూసా
నీ జాడనే చూసి చెబుతాయేమోఅని
నీ గాలితో కబురు పంపా
మేఘాలతో కబురు పంపా
నా వేదనే నీకు వివరించాలి అని
ఈ కాలం పైన కత్తి దుయ్యాల నుంది
నిన్ను ఇంకా దాచి పెట్టినందుకు
నా దేహం పైన మట్టి పొయ్యాలనుంది
నాకు నీతో రాసి పెట్టనందుకు
చిలక ఓ రామ చిలకా
చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరక
చిలక ఓ రామ చిలకా
ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునక
కన్నీటి సంద్రంలోన
కంటి పాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే
ఏవి ఏవి మరి నిన్నటి కలలు లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండ వాలి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేనులే
వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా
వెళ్లాలని లేకున్నా భారంగా వెళ్తున్నా
నువ్వెంత రమ్మన్నా రాలేను అంటున్నా
నేనంటూ ఏమైనా నువ్వు క్షేమంగుంటే చాలనుకుంటున్నా
ఏ దారి మూస్తున్నా ఏదారి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా
చిలక ఓ రామ చిలకా
నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనుక
చిలక ఓ రామ చిలకా
జత రావకంటే అలుపే ఒంటరి నడక
0 Comments