Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

దాన్నే . .. ప్రేమ అంటారేమో. . . ❤️

 సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం. .. 🌟

నేను ఇంటర్ చదివే రోజుల్లో .... 💼


మేము . .సింగనమల. . . 🏡

అనే వూళ్ళో వుండే వాళ్ళం . . .

మేము చదివే కాలేజీ ..

అనంతపూర్ లో. .. ఉండేది. . . 🎓


అది . . హాస్టల్ క్యాంపస్ . . 💼

క్లాసులు . .ఉదయాన్నే స్టార్ట్ ఐపోయేవి. . .



ఉదయం ఐదింటికి. . . 🌅

మా ఊరి నుండి .. .

ఫస్ట్ బస్సు ఉండేది. . . 🚌


పేరుకి ...హాస్టల్ కానీ. . 💼

మేము డేస్ స్కాలర్స్ కదా . .

మా కారియర్ మేమే ..

తీసుకెళ్లాలి . . 💼


ఆ టైం కి.. .. నిద్ర లేచి

రెడీ కావడమే కష్టం. . . 😴


కానీ. . ఒక పది నిమిషాలు. .

ముందుగానే. . .

మా అమ్మ . .. .

ఒక పెద్ద కారియర్ నిండా.. . . 🌟

పప్పన్నం. . .

రసమన్నం . .

పెరుగన్నం . . .

అన్ని పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేసేది .. . 🥘


మా కారియర్ చూసి. . .

బస్సు లో . .. కండక్టర్ కూడా.. ..

ఇంత పొద్దునే అంత పెద్ద

కారియర్ ఎలాగా అని .

ఆశ్చర్యపోయేవాడు. . . 🤩

ఇప్పుడు కూడా. . .బస్సు స్టాండ్ లో. .

కనపడితే .. . .గుర్తు పడతాడు ..

మేము మా కారియర్ అంత ఫేమస్. . 🌟


మా ఫ్రెండ్స్కూ, లెక్చరర్స్ కూడా

అనేవారు . . మీరు చాలా . .

లక్కీ అని. . . 🍀


అసలు తాను ...

ఎప్పుడు లేస్తుంది. . .

ఇవన్నీ . . ఎప్పుడు చేస్తుంది. .. . .

అని ... .. తెలుకోవడానికి. . .

చాలా ట్రై చేసాము .

కానీ . .కనిపెట్టలేకపోయాము. ..


తూరుపు . .దిక్కున. ..

ఆ సూర్యుడు . .ఎలా

రోజు. . .ఉదయించేవాడో. . .

వేకుమ జామున. .. .

మా అమ్మ కూడా. ..

అలానే. . .


ఒకరు చెప్తే . . .

చేసే దాన్ని పని అంటారు. . .

ఎవ్వరు .. .చెప్పకున్న.. .. .

అన్ని. . .టైం సరిగ్గా . . .

చక్కబెట్టుకుంటూ. .. . ఉంటే .

దాన్నే . .. ప్రేమ అంటారేమో. . . ❤️


డబ్బిచ్చి... . .దేన్నయినా కొనచ్చు, , ,

కానీ.. .. అమ్మ ప్రేమను మాత్రం . . .

కొనలేము .. .

ఎందుకంటే .. .

అది వెల కట్టలేనిది. . . ❤️


Many Many Happy Returns Of The Day Amma. . .

You May Not Be with Us. . .

But Your Memories Will Always Be With Us ..


@ Hema - Chandra & Family 🌸

Post a Comment

0 Comments